Saturday, August 30, 2025

విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు

Must Read

తెలంగాణ రాష్ట్రంలో ఈ వారంలో పాఠశాలలు, కళాశాలలకు వరుసగా మూడు రోజుల సెలవులు లభించాయి. ఆగస్టు 8వ తేదీ శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా, ఆగస్టు 9వ తేదీ రాఖీ పౌర్ణమి రోజు రెండో శనివారం కావడంతో ఆ రోజు కూడా విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఆ తర్వాతి రోజు, ఆగస్టు 10వ తేదీ ఆదివారం కావడంతో మొత్తం మూడు రోజుల పాటు విద్యార్థులకు విశ్రాంతి దొరుకుతోంది. ఈ విరామం కారణంగా హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపాలని విద్యార్థులు ఉత్సాహంగా బయలుదేరుతున్నారు. మరోవైపు, వచ్చే వారంలో కూడా వరుస సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్రం దినోత్సవం, ఆగస్టు 16వ తేదీ శ్రీకృష్ణాష్టమి పర్వదినం, ఆ తర్వాతి రోజు 17వ తేదీ ఆదివారం కావడంతో మళ్లీ శుక్ర, శని, ఆదివారాలు వరుసగా సెలవులు దొరుకుతున్నాయి. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో చిన్న పర్యటనలకు ప్లాన్ చేస్తూ, హిల్‌స్టేషన్లు, పుణ్యక్షేత్రాల వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు ముందస్తు బుకింగ్స్‌ చేస్తున్నారు. ఈ రెండు వారాలు విద్యార్థులకు సెలవుల వారం లాగా మారబోతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -