రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇందుకు గాను ఏటా రూ.7వేల కోట్లు అవసరం పడతాయని అంచనా. అయితే, ఈ పథకాన్ని 10 లేదా 7 ఎకరాలకు పరిమితం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఒక వ్యక్తికి ఎన్ని ఎకరాలు ఉన్నా.. 7 లేదా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా రానుంది.