సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగం అధికారితో కూడిన ప్రతినిధి బృందాన్ని తక్షణమే సౌదీకి పంపించాలని ఆదేశించింది. మృతదేహాలను మత సంప్రదాయాలకు అనుగుణంగా అక్కడే అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

