Wednesday, December 4, 2024

‘మహా’పీఠం ఫడ్నవీస్ కేనా?

Must Read

మహారాష్ట్రలో మహాయుతి కూటమి(బీజేపీ, శివసేన(షిండే వర్గం), ఎన్సీపీ(అజిత్ పవార్) విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లకు గాను మహాయుతి కూటమి 233 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ మహా వికాస్ అఘాడీ కూటమి(కాంగ్రెస్, శివసేన(థాక్రే), ఎన్సీపీ(శరత్ పవార్) కేవలం 51 సీట్లకే పరిమితం అయింది. దీంతో మహాయుతి కూటమి నుంచి ఎవరు సీఎం అవుతారు? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్, శివసేన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మధ్య పోటీ నెలకొంది. అయితే, మహాయుతి కూటమిలో 133 సీట్లు గెలిచి, కీలక పాత్ర పోషించిన బీజేపీకే ముఖ్యమంత్రి పీఠం వరించే అవకాశం ఉంది. ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరలా ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి ఏక్ నాథ్ షిండే రాజీనామా చేయగా గవర్నర్ సీపీ రాధాకృష్ణ దానిని ఆమోదించారు. దీంతో ఏక్ నాథ్ షిండే తాత్కాలిక సీఎంగా కొనసాగుతున్నారు. మహాయుతి కూటమికి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అనే దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ, దాదాపు ఫడ్నవీస్ సే సీఎం అవుతారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హైదరాబాద్ లో భూకంపం!

మహా నగరం హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఏపీలో పలుచోట్ల భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్ మెంట్లు వదిలి బయటకు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -