Monday, March 23, 2026

ముప్పై ఏళ్లలో మీరెందుకు అభివృద్ధి చేయలేదు?

Must Read

రాజకీయం అంటే కేవలం అధికార దాహం కాదు, ప్రజలకు సేవ చేయాలన్న తపన అని మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఆదివారం నగరిలోని తన నివాసంలో పుత్తూరు మున్సిపల్ మాజీ పాలకవర్గ సభ్యుల సత్కార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై మరియు స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. తన ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా కష్టకాలంలో గడిచిపోయినప్పటికీ, మిగిలిన మూడేళ్లలోనే నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని ఆమె గర్వంగా ప్రకటించారు. గత ముప్పై ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఏలిన నాయకులు ఎందుకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారని ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని, కేవలం “దోచుకుందాం.. దాచుకుందాం” అనే ధోరణితోనే పాలన సాగుతోందని ఆమె మండిపడ్డారు. నగరిలో టీటీడీ కళ్యాణ మండపాలు లేని పరిస్థితి నుంచి, నేడు అనేక దేవాలయాల నిర్మాణం వరకు తానే చొరవ తీసుకున్నానని, ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రస్తుత పాలకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

చరిత్ర సృష్టించిన ప్రధాని మోడీ

భారత రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వాధినేతగా కొనసాగిన నాయకుడిగా ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -