Friday, November 15, 2024

మూసీని మరో సిటీ చేస్తా: రేవంత్ రెడ్డి

Must Read

– నవంబర్ 1న మూసీ పనులకు శంకుస్థాపన

హైదరాబాద్ లో మూసీని ప్రక్షాళన చేసి మరో సిటీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ వద్ద ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని నెలకొల్పుతామని పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు మార్కెట్ ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు. మల్లన్న సాగర్ నుంచి 7 వేల కోట్లతో నీటిని ఉస్మాన్ సాగర్‌కి మళ్ళిస్తామన్నారు. ఉస్మాన్ సాగర్ నుంచ హిమాయత్ సాగర్ బాపూఘాట్ వద్ద నీటిని శుద్ధి చేసి ఎస్టీపీల ద్వారా నీటీని మూసీలోకి వదులుతామన్నారు. నెల రోజుల్లో ఇందుకు సంబంధించిన డిజైన్లు అన్నీ పూర్తి అవుతాయన్నారు. మూసీని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ వెంట అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్ లను ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ ఒకటో తారీఖు మూసీ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. మూసీపై కేటీఆర్, హరీశ్, ఈటెల రాజేందర్ కు మూసీపై విజన్ ఉంటే తమకు తెలపాలన్నారు. త్వరలో వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తామన్నారు. త్వరలో కేసీఆర్ పేరు కనుమరుగు అవుతుందన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశంలో శక్తిమంతులు వీళ్లే..!!

రాజకీయ రంగంలో దేశంలోని అత్యంత శక్తిమంతులను ఇండియా టుడే ప్రకటించింది. ఇందులో తొలిస్థానంలో ప్రధాని మోడీ, రెండో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలిచారు....
- Advertisement -

More Articles Like This

- Advertisement -