ఏపీ సీఎం వియ్యంకుడు, నటుడు నందమూరి బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించనుంది. బాలకృష్ణ స్టూడియో నిర్మాణానికి రేవంత్ సర్కారు భూమి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈమేరకు రెవెన్యూ అధికారులు సీఎస్ కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇయ్యాల జరిగే కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.