హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో అక్రమ నిర్మాణాలు గుర్తించారు. రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు హైకోర్టును ఆశ్రయించగా, తొలగింపుకు ఆదేశాలు జారీ అయ్యాయి. సోమవారం ఉదయం హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తుతో నాలుగు షెడ్లు, నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు.

