మేడిపల్లి పరిధిలో చిన్నారి జీవితాన్ని చీకటిలోకి నెట్టిన సంఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాల ప్రకారం, చిన్న వయసులోనే అక్క, బావల సంరక్షణలో పెరిగిన ఓ బాలిక అక్కడే నివాసముంటోంది. గత ఏడాది పెంపుడు తల్లి మరణించగా, తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితుల్లో చదువు మానేసి ఇంట్లోనే ఉన్న బాలిక సోషల్ మీడియాలోకి ఆకర్షితమైంది. ఈ క్రమంలో అలియాబాద్‌కు చెందిన రవితేజ అనే యువకుడితో స్నాప్‌చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. బాలిక ఒంటరితనాన్ని గమనించిన రవితేజ ఆమెను మాయమాటలతో తన చెరలోకి లాగుకున్నాడు. గత రెండు నెలలుగా అతడు బాలిక ఇంటికే వచ్చి సహజీవనం చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. విషయం బయటపడడంతో బాలిక సొంత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానిపై మేడిపల్లి పోలీసులు స్పందించి రవితేజపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.