ఏపీలో యోగా టీచర్లు జీతాల కోసం రోడ్డెక్కారు. గత రెండు రోజులుగా విజయవాడలోని సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కాగా, నేడు మంత్రి లోకేష్‌ని కలవడానికి వెళ్లిన యోగా టీచర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లోకేష్‌ని కలవడానికి వీల్లేదని తిరిగి పంపేశారు. మహిళా యోగా టీచర్లు అని కూడా చూడకుండా పలువురిని అరెస్ట్ చేశారు. వారి ఫోన్లు లాక్కుని దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు, యోగా టీచర్ల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 1056 మంది యోగా టీచర్లకు వేతనాలు చెల్లించాలని, శాశ్వతంగా నియామకం చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఇంటి ముందు యోగాసనాలు వేసి నిరసన తెలిపారు. అయితే యోగా టీచర్లు సమస్య చెప్పనివ్వకుండా పోలీసులు వారిని తిరిగి పంపించేస్తున్నారు.