Monday, January 26, 2026

పోర్న్ వీడియోలు చేస్తున్న దంప‌తుల అరెస్ట్

Must Read

పోర్న్ వీడియోలు చిత్రీక‌రిస్తూ అమ్ముకుంటున్న ఓ దంప‌తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లోని అంబర్‌పేటలో హెచ్‌డీ కెమెరాలతో దంపతులు లైవ్ న్యూడ్ వీడియోల వ్యాపారం చేస్తున్నారు. రూ.2000కు లైవ్ లింక్, రూ.500కు రికార్డెడ్ వీడియోలు అమ్ముకుంటున్నారు. కొద్ది రోజులుగా ఈ వ్యాపారం సాగుతుంద‌గా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు.బాగ్ అంబర్‌పేటలోని మల్లికార్జుననగర్‌లోని ఓ క్యాబ్ డ్రైవ‌ర్‌ తన భార్యతో లైవ్ న్యూడ్ వీడియోల దందా నడిపిస్తున్నాడు. క్యాబ్ డ్రైవింగ్ కంటే ఈ దందాతోనే ఎక్కువ డబ్బులు రావడంతో ఇంటిపై హెచ్‌డీ కెమెరాలతో ఫుల్ సెటప్ ఏర్పాటు చేసుకున్నాడు. రోజూ కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ ఆన్‌లైన్‌లో శృంగార చాటింగ్ చేస్తూ యువకులను ఆకట్టుకుంటున్నారు. ప్రేక్షకులు పెరగడంతో వీడియోలు పోలీసుల వ‌ర‌కు చేరాయి. స‌ద‌రు వ్య‌క్తి ఇంటిపై దాడి చేసిన పోలీసులు హెచ్‌డీ కెమెరాలను, పరికరాలను సీజ్ చేసి, దంపతులను అరెస్ట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -