Monday, January 26, 2026

యువత ఆకాంక్షల‌తో జనసేన ప్రయాణం: పవన్ కళ్యాణ్

Must Read

జనసేన పార్టీతో తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన ఏడేళ్ల గుర్తుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ వేదికపై ఓ హృదయస్పర్శి సందేశాన్ని పంచుకున్నారు. 2018 అక్టోబర్ 12న శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ తర్వాత యువతతో కలిసి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించిన ఆ రోజును గుర్తు చేసుకుంటూ, ఆ సందర్భంగా తీసిన ఫోటోను షేర్ చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం, స్ఫూర్తిదాయక నాయకత్వం తమకు ఎల్లవేళలా బలాన్నిచ్చాయని, యువత ఆకాంక్షలను ప్రతిబింబించే ఆంధ్రప్రదేశ్ కోసం తాము కృషి చేస్తున్నామని నాదెండ్ల తెలిపారు. పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ఏడేళ్ల రాజకీయ జీవితం సేవ, స్ఫూర్తి, సంకల్పంతో నిండినదని ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువత ఆశలు, ఆకాంక్షలను గుర్తు చేశారు. “యువత ఉచితాల కోసం అడగలేదు, సంక్షేమ పథకాల కోసం కోరలేదు. వారు ఒకే మాట చెప్పారు—మాకు ఉచితాలు కాదు, భవిష్యత్తు కావాలి. 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండి!” అని పవన్ ఉద్ఘాటించారు. యువతలోని నిజమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు, వారి కలలను నెరవేర్చేందుకు తాను నిరంతరం యువతతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటానని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. జనసేన పార్టీ యువత ఆశయాలతో, రాష్ట్ర భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ఈ సందేశాలు స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -