భారత్‌లో ఉగ్రదాడుల మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయన్న నిజాన్ని పాక్ ఎప్పటికీ అంగీకరించదు. ఢిల్లీ కారు బాంబు పేలుడును కూడా తక్కువ చేసేందుకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రయత్నించాడు. ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు మాత్రమేనని, భారత్ రాజకీయ లబ్ధి కోసం దీన్ని ఉపయోగిస్తోందని ఆరోపించాడు. ఒక టీవీ కార్యక్రమంలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. భద్రతా సంస్థలు దీన్ని ఉగ్రదాడిగా నిర్ధారించాయి. నిన్నటివరకు గ్యాస్ పేలుడు అనుకున్నారు, ఇప్పుడు విదేశీ కుట్రగా చూపిస్తున్నారని ఆసిఫ్ అన్నాడు. రేపు భారత్ మా మీద దాడి చేస్తే ఆశ్చర్యపోనని పేర్కొన్నాడు. ఆసిఫ్ వ్యాఖ్యల్లో భయం కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. పుల్వామా, ఉరి, ముంబై దాడుల సమయంలో కూడా పాక్ ఇలాగే తప్పించుకుంది. ఢిల్లీ దాడి ఉగ్ర సంబంధితమేనని కేంద్రం స్పష్టం చేసింది. దాడికి పాక్ ఆధారిత జైషే మహ్మద్ మాడ్యూల్‌తో లింకులు ఉన్నట్లు విచారణలో తేలింది.

