Thursday, January 15, 2026

అనకాపల్లి ఘటనతో కీల‌క నిర్ణ‌యం

Must Read

అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్ర‌మాదంలో చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాలను అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. గాయపడిన 8 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. మిగిలివారిలో నర్సీపట్నం ఆసుపత్రిలో ఇద్దరికి, విశాఖ కేజీహెచ్​లో నలుగురికి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది కైలాసపట్నానికి చెందిన వారు ఉండటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియల్లో గ్రామస్తులు పాల్గొన్నారు. బాణసంచా పేలుడు ప్రాంతంలో అగ్నిమాపకశాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌ పర్యటించారు. ధ్వంసమైన భవనాలను పరిశీలించి అనుమతులు, తయారీదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ప్రతాప్‌ చెప్పారు. ఘటనాస్థలిలో అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బాణసంచా తయారీకి సిద్ధంగా ఉంచిన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బాణసంచాను భూమిలో పాతిపెట్టేందుకు నిర్ణ‌యించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -