Monday, January 26, 2026

నిండుకుండలా నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్ట్

Must Read

ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. నేడు ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తనున్నారు. ప్రస్తుతం సాగర్‌కు 2,01,743 క్యూసెక్కుల వరద వస్తుండగా, 41,497 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 586.80 అడుగుల వద్ద నీటిమట్టం నమోదైంది. సాగర్‌ గరిష్ఠ నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 304.4680 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. జూలై నెలలోనే సాగర్‌ నిండుకుండలా కావడం 18 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావ‌డం విశేషం. మ‌రోవైపు శ్రీశైలం ప్రాజెక్టులోనూ భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండ‌టంతో 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -