Tuesday, October 21, 2025

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేత‌ల‌వ‌న్నీ అబ‌ద్ధాలే – ఎమ్మెల్సీ కవిత

Must Read

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల‌న్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే వాదనలు నూటికి నూరుపాళ్లూ అవాస్తవం,” అని కవిత స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగినప్పటికీ, అక్కడి నుంచి ఇప్పటివరకు 5,657 టీఎంసీల నీరు ప్రవహించినప్పటికీ బ్యారేజీకి ఎలాంటి చెక్కు చెదరలేదని తెలిపారు. ఆ రెండు పిల్లర్లు కుంగిన బ్లాక్ నుంచే నీటి ప్రవాహం ఎక్కువగా సాగిందని వెల్లడించిన ఆమె, “ఇకనైనా పాలకులు నిజాన్ని గుర్తించి, కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించే దిశగా పనిచేయాలి” అని హితవు పలికారు. మేడిగడ్డకు తగిన రిపేర్లు చేసి, మళ్లీ కాళేశ్వరం మోటార్లు ప్రారంభించాల్సిన అవసరం ఉందని, అప్పుడే రైతు పొలాలకు నీరందుతుందని ఆమె సూచించారు. ఎన్డీఎస్ఏ పేరుతో రైతులను మోసం చేసే ప్రయత్నాలకు పూర్తి విరమణ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -