Thursday, November 14, 2024

జీవన్ రెడ్డి తిరుగుబాటు!

Must Read

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం!

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సొంత పార్టీపైనే అసహనం వెళ్ళగక్కారు. కాంగ్రెస్ పాలనలో సొంత పార్టీ నేతలకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్య గురయ్యారు. కారుతో ఢీకొట్టి, కత్తితో పొడిచి చంపేశారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న జీవన్ రెడ్డి.. కన్నీటిపర్యంతం అయ్యారు. రోడ్డు మీద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. పక్కనే ఉన్న కాంగ్రెస్ లీడర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. ‘‘నీకో దండం.. నీ పార్టీకో దండం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నానని తెలిపారు. ఈక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డికి ఫోన్ లో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం.. తాను పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. తనను క్షమించాలంటూ మహేశ్ ఫోన్ కాల్ కట్ చేశారు. కాగా, గంగారెడ్డిని హత్య చేసిన నిందితుడు సంతోశ్ ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశంలో శక్తిమంతులు వీళ్లే..!!

రాజకీయ రంగంలో దేశంలోని అత్యంత శక్తిమంతులను ఇండియా టుడే ప్రకటించింది. ఇందులో తొలిస్థానంలో ప్రధాని మోడీ, రెండో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలిచారు....
- Advertisement -

More Articles Like This

- Advertisement -