Friday, August 29, 2025

ఫిరాయింపుల కేసు తీర్పుపై క‌డియం కామెంట్స్

Must Read

తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌ అన‌ర్హ‌త కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఈ సంద‌ర్బంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామ‌న్నారు. స్పీకర్‌ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూస్తామ‌న్నారు. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పాటవాన్ని చదవాల్సి ఉంద‌ని, స్పీకర్‌కు మూడు నెలల సమయం ఇచ్చింద‌ని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా న్యాయపరంగా నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నామ‌న్నారు. ఇప్పుడప్పుడే ఉప ఎన్నికలు వస్తాయని కొందరు ఊహిస్తున్నా అలాంటిదేమీ ఉండకపోవచ్చని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. స్పీకర్‌ నిర్ణయం తర్వాత జాతీయ ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంద‌ని, దీంతో ఉప ఎన్నికల విషయంలో చాలా సమయం ఉంద‌ని వ్యాఖ్యానించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -