Saturday, August 30, 2025

ముందు కట్టాలి..ఆ తర్వాత సబ్సిడీ ఇస్తాం!

Must Read

ఎన్నికల సమయంలో ఇంటింటికీ మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి ప్రచారం చేసింది. కానీ, గెలిచిన అనంతరం మెలికపెట్టింది. ముందు సిలిండర్లకు డబ్బులు ఇస్తేనే.. ఆ తర్వాత అకౌంట్ లో సబ్సిడీ జమ చేస్తామని తెలిపింది. ఈ పథకం వివరాలను సోమవారం మంత్రి సత్య నాదేండ్ల వెల్లడించారు. ఈ పథకం ఎల్.పి.జి.కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారికే అమలవుతుందన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.2,684.75 కోట్ల భారం పడుతుందన్నారు. ఈ నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్ ను ప్రారంభిస్తామని తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో డెలివరీ జరుగుతుందన్నారు. సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా రాయితీ సొమ్ము జమ చేస్తామన్నారు. మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చన్నారు. మిగిలిన సమయాల్లో ప్రజలే పూర్తి డబ్బులు చెల్లించాలన్నారు. ప్రభుత్వం నుంచి కేవలం మూడు సిలిండర్లు మాత్రమే ఇస్తామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -