బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష RJD కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 27 నాయకులను బహిష్కరించింది. పార్టీ చీఫ్ మంగని లాల్ మండల్ ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. బహిష్కరించిన నాయకులను ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. మహాగఠ్ బంధన్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినందుకు ఈ చర్య తీసుకున్నారు. బహిష్కరించిన 27 మందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు చోటే లాల్ రాయ్ మహ్మద్ కమ్రాన్ నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ముందుగా BJP కూడా ఆరుగురు నేతలను బహిష్కరించింది. NDA అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసినందుకు ఈ చర్య తీసుకున్నారు. బహిష్కరించిన వారిలో ఎమ్మెల్యే పవన్ యాదవ్ ఉన్నారు. టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. నవంబర్ 6 11 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు.

