తెలంగాణ రాష్ట్ర సాధనకై జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్‌లో.. “తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ ఉద్యమ చుక్కాని ప్రొఫెసర్ జయశంకర్‌కు జయంతి సందర్భంగా ఘన నివాళులు. తెలంగాణ భావజాల వ్యాప్తికే తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ఆయన. రాష్ట్ర మలిదశ ఉద్యమానికి రథసారథి కేసీఆర్‌కు అండగా నిలిచి, తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాక పోరాడిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్” అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న ప్రస్తుత తరుణంలో జయశంకర్ సార్ సిద్ధాంతాలు, ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు. “తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ప్రతి తెలంగాణవాది కంకణబద్ధుడవుతాడనే నమ్మకం ఉంది” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.