Friday, October 31, 2025

ఢిల్లీ పార్టీని న‌మ్మితే తెలంగాణ బ‌తుకు సున్నా

Must Read

ఢిల్లీ పార్టీని న‌మ్మితే తెలంగాణ బ‌తుకు సున్నా అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై , రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సన్నాసి ఢిల్లీ పార్టీలను నమ్మితే తెలంగాణ బతుకు సున్నా అని మరోసారి రుజువుచేసిన సందర్భమిద‌ని పేర్కొన్నారు. తెలివి లేని దద్దమ్మను గద్దెనెక్కిస్తార‌ని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తార‌ని, కోట్లాది మంది జీవితాలతో చెలగాటమాడతార‌ని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రాన్ని పాతాళానికి పడేసిన ఈ పాపం క్షమించరానిద‌న్నారు. టూరిస్టు పార్టీలను నమ్మితే ఇలాగే విధ్వంసం జ‌రుగుతుంద‌న్నారు. విజన్ లేనోళ్ల చేతిలో..
రాష్ట్రాన్ని పెడితే జరిగేది వినాశనమేన‌న్నారు. నాటి పదేళ్ల దార్శనిక పాలనకు.. నేటి దగుల్బాజీ విధానాలకు మధ్య తేడాను నాలుగు కోట్ల సమాజం నిశితంగా గమనిస్తోంద‌ని పేర్కొన్నారు. ఇక జీవితంలో ఈ ఢిల్లీ పార్టీలను..
తెలంగాణ నమ్మద‌ని, మళ్లీ ఎప్పటికీ మోసపోద‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి: వైయ‌స్ జగన్

మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. తుపాను ముప్పు తగ్గే వరకు అందరూ సురక్షిత...
- Advertisement -

More Articles Like This

- Advertisement -