భారత్‌లో చెత్త నిర్వహణ తీవ్ర సమస్యగా మారిందని బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా అన్నారు. బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి నగరాల్లో చెత్త సమస్యను పరిష్కరించలేకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్‌లో ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. బెంగళూరు రోడ్లు, చెత్తపై విదేశీ విజిటర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపారు. ప్రజలు, అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. దీనిపై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే స్పందిస్తూ, బెంగళూరులో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.