కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మభ్యపెడుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ ధ్యేయంగా శనివారం బీసీ బంద్ కు మద్దతు ప్రకటించారు. తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతిగా ఉందని చెప్పారు. జాగృతి కార్యకర్తలు బంద్ లో పాల్గొంటారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో చట్టం చేసే వరకు జాగృతి పోరాటం చేస్తుందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చేలా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.