తెలంగాణ-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు భారీగా మోహరించారు. కర్రెగుట్టలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు వద్ద కొత్త సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్‌ను ఐజీ త్రివిక్రమ్ ఐపీఎస్ ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతూ, తక్కువ సమయంలోనే కర్రెగుట్టలపై పట్టు సాధించామని, ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని చెప్పారు. త్వరలో రోడ్డు నిర్మాణం, మరో క్యాంప్ ఏర్పాటు చేస్తామని, ప్రజలు స్వేచ్ఛగా తిరిగేలా చర్యలు తీసుకుంటామని, స్థానికుల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు.

