జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి జనం బాట పేరుతో నాలుగు నెలల సుదీర్ఘ యాత్రను అక్టోబర్ 25న ప్రారంభిస్తారు. ఈ యాత్ర ఫిబ్రవరి 13 వరకు 33 జిల్లాల్లో కొనసాగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఇందల్వాయి టోల్గేట్ వద్ద బైక్ ర్యాలీలో పాల్గొని, జాగృతి కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నవీపేట మండలం యంచ వద్ద ముంపు బాధితులతో సమావేశం, నందిపేటలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేస్తారు. ఉదయం 9 గంటలకు గన్‌పార్క్‌లో నివాళులర్పించి, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకుంటారు. యాత్రలో మేధావులు, విద్యావంతులతో చర్చలు జరపనున్నారు. రాజకీయంగా ముందడుగు వేయడంతో పాటు, ప్రజలు కోరితే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశముందని కవిత ప్రకటించారు.

