Friday, November 15, 2024

ఇంటికో ఉద్యోగమంటే ఇదేనా?

Must Read

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. భారీగా టెండర్లు జరిగాయి. దీంతో బెల్టు షాపులు సైతం రెట్టింపయ్యాయి. ఎక్కడ చూసినా మందు బాటిళ్లే కనిపిస్తున్నాయి. తాజాగా పలు సంతల్లో లిక్కర్ బాటిళ్లను టేబుల్ పై పెట్టి, అమ్ముతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎక్కడ చూసినా మద్యం విక్రయాలే కనిపిస్తున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మద్యం ఆదాయంపైనే కూటమి ప్రభుత్వం ఆధారపడిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా, సంతలో లిక్కర్ బాటిళ్లు అమ్మడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటికో ఉద్యోగమంటే.. ఇంటి ముందు బాటిళ్లు అమ్ముకోవడమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం యువతను మద్యం మత్తులో ముంచెత్తి, కాసులు వెనకేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. మరి మీరేం అంటారు?

- Advertisement -
- Advertisement -
Latest News

దేశంలో శక్తిమంతులు వీళ్లే..!!

రాజకీయ రంగంలో దేశంలోని అత్యంత శక్తిమంతులను ఇండియా టుడే ప్రకటించింది. ఇందులో తొలిస్థానంలో ప్రధాని మోడీ, రెండో స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిలిచారు....
- Advertisement -

More Articles Like This

- Advertisement -