Tuesday, October 21, 2025

ఏపీ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

Must Read

ఏపీ కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ శుక్రవారం ఉదయం ఫలితాలను ప్రకటించారు. ఈ మేరకు ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. వైసీపీ హయాంలో 2022 అక్టోబర్‌లో నిర్వహించిన కానిస్టేబుల్‌ పరీక్షలు న్యాయ వివాదాల కారణంగా ఆలస్యమైనప్పటికీ, నేడు ఫలితాలు వెలువడ్డాయి. 2022 జనవరి 22న జరిగిన ప్రిలిమినరీ రాత పరీక్ష ద్వారా మొత్తం 6,100 కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్షల కోసం మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 5,03,487 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 4,58,219 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 30 శాతం గా నిర్ణయించారు. ఇటీవల జరిగిన పరీక్షకు 37,600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 33,921 మంది ఉత్తీర్ణులు కాగా, అందులో 29,211 మంది పురుషులు, 4,710 మంది మహిళలు అర్హత సాధించారు. ఓఎంఆర్‌ షీట్లు జూలై 12, 2025 వరకు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -