Thursday, November 20, 2025

రాజమౌళి సినిమాలను హిందువులు బహిష్కరించాలి – ఎమ్మెల్యే రాజాసింగ్

Must Read

ఎమ్మెల్యే రాజాసింగ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “నీ అమ్మానాన్నలకు హనుమంతుడిపై విశ్వాసం ఉంది కానీ నీకు లేదంటున్నావు. నీకు విశ్వాసం లేకపోయినా అదే హనుమంతుడి పేరుతో బాహుబలి సినిమా తీసి ప్రభాస్‌తో శివలింగం ఎత్తించి కోట్ల రూపాయలు సంపాదించావు. శ్రీకృష్ణుడికి చెందిన 16 వేల మంది భార్యలను ‘లవర్స్’ అని హేళన చేశావు. రామాయణం బోరింగ్ స్టోరీ అని గతంలో ట్వీట్ చేశావు. ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి పేరుతో మరో సినిమా తీస్తున్నావు. నీకు నిజంగానే దేవుళ్లపై నమ్మకం లేదా? నాస్తికుడివా? ఒకసారి స్పష్టంగా డిక్లేర్ చెయ్” అని రాజాసింగ్ నిలదీశారు. “అసలు తప్పు హిందువులదే. ఇలాంటి నీచమైన డైరెక్టర్లను గుర్తించలేకపోతున్నారు. ధర్మం, దేవుళ్లపై నమ్మకం లేని వ్యక్తి సినిమాలు హిందువులు ఎందుకు చూడాలి? ఇలాంటి వాళ్లపై కంప్లైంట్లు ఇవ్వండి. జైలుకు పంపితే తప్ప వీళ్లకు బుద్ధి రాదు. రాజమౌళి సినిమాలు పూర్తిగా బ్యాన్ చేద్దాం. ఇలాంటి వ్యక్తులు నాస్తికత్వం పేరుతో మన దేవుళ్లను అవమానిస్తారు” అని రాజాసింగ్ హిందూ సమాజానికి పిలుపునిచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాపులే సీఎంలను నిర్ణయిస్తార‌న్న అంబ‌టి రాంబాబు!

1989 కాంగ్రెస్, 2024 చంద్రబాబు గెలుపున‌కు కాపులే కారణమని వైసీపీ నేత‌ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రేపల్లెలో జరిగిన కాపు కార్తీక సమారాధన సమావేశంలో మాజీ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -