Tuesday, April 22, 2025

స్పీకర్ దే తుది నిర్ణయం: హైకోర్టు సంచలన తీర్పు

Must Read

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఒక పార్టీపై గెలిచి మరోపార్టీలో చేరారని పిటిషన్ వేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును వాయిదా వేసింది. నేడు దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంపై స్పీకరే నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. తీర్పు కోసం స్పీకర్ నిర్దిష్ట సమయంలో మాత్రమే తీసుకోవాలనే రూల్ లేదని పేర్కొంది. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో బీఆర్ఎస్ కు నిరాశే ఎదురైంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.ల‌క్ష దాటిన ప‌సిడి!

దేశంలో బంగారం ధ‌ర‌లు కొండెక్కిపోతున్నాయి. రోజురోజుకీ సామాన్యుల‌కు అంద‌న్నంత స్థాయికి చేరుకుంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధ‌ర‌ కేవ‌లం గ‌త తొమ్మిది నెల‌ల కాలంలోనే రూ.22,000...
- Advertisement -

More Articles Like This

- Advertisement -