హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఈసారి డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్‌లో రహస్య పెళ్లి జరగబోతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చిన విషయం రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామల క్రిప్టిక్ పోస్ట్ అని తెలుస్తోంది. “తెగించిన వాళ్లే అలాంటి పనులు చేస్తారు” అని ఆమె రాసిన పోస్ట్ చుట్టూ భారీ చర్చ నడుస్తోంది. అయితే సమంత లేదా రాజ్ నిడిమోరు ఇప్పటి వరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.

