నేడు కంచె గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ తీర్పుపై అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు సామాన్యుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఒక వైపు అవి వర్సిటీ భూములని విద్యార్థులు, ప్రభుత్వ భూమి అని సర్కార్ వాదిస్తున్నారు. అక్కడ అడవి లేదని, వినియోగంలో లేక చెట్లు పెరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.