తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబరు 25న జరగనున్న కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డిసెంబర్‌లోపు ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. డెడికేషన్ కమిషన్ 50 శాతం రిజర్వేషన్ల నివేదిక రెండు-మూడు రోజుల్లో సిద్ధం చేయనుంది. ఆ తర్వాత కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే 31 జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందజేస్తారు. జనవరి 25లోగా మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

