Saturday, August 30, 2025

ఆదివాసీ బాలికపై అఘాయిత్యం!

Must Read

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఆదివాసీ బాలిక ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలో గాయాలతో, చిరిగిన దుస్తులతో కనిపించిన బాలికను స్థానిక వాచ్‌మన్ సమాచారం అందించడంతో అధికారులు వెంటనే రక్షణలోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలానికి చెందిన బాలిక వారం క్రితం ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా కుంటలోని బంధువుల వద్దకు వెళ్లింది. శనివారం తిరిగి చింతూరులోని గొల్లగుప్పకు వెళ్లేందుకు కుంట బస్టాండ్‌ చేరుకుంది. బస్సులు లేకపోవడంతో ట్రాలీ ఆటో ఎక్కగా, అందులోని ఇద్దరు యువకులు మద్యపానం చేస్తూ తనకు కూడా మత్తుమందు కలిపిన పానీయాన్ని బలవంతంగా తాగించారని, అనంతరం స్పృహ కోల్పోయానని బాలిక తెలిపింది. మెలకువ వచ్చేసరికి తాను పాల్వంచలో ఉన్నానని చెప్పింది. బాలికను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయాలు, చిరిగిన దుస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్య నివేదిక అనంతరం స్పష్టమవుతుందని సీడీపీవో లక్ష్మీప్రసన్న, పాల్వంచ సీఐ సతీష్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -