Saturday, August 30, 2025

రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం

Must Read

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఓ బాల్యవివాహం వెలుగులోకి వ‌చ్చింది. భర్త మృతి చెంద‌డంతో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ తన 13 ఏళ్ల కూతురిని 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి వివాహం చేయించింది. మధ్యవర్తి సూచనతో ఈ వివాహం మే 28న జరిగింది. అప్ప‌టి నుంచి బాలిక త‌ల్లితోనే ఉంటోంది. దీంతో పెళ్లి జ‌రిగిన విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. ఇటీవల అత్త వారింటికి పంపేందుకు బాలిక‌ను ఒత్తిడి చేయ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఎనిమిదో తరగతి చదువుతున్న స‌ద‌రు బాలిక ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తన బాధను స్కూల్ ప్రిన్సిపాల్‌కి చెప్పింది. త‌న‌కు ఇంకా చ‌దువుకోవాల‌ని ఉంద‌ని తెలిపింది. వెంటనే ప్రిన్సిపాల్‌ సమాచారం ఇవ్వడంతో తహసీల్దార్, పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లి స్ర‌వంతి, వరుడు శ్రీనివాస్ గౌడ్, వివాహం కుదిర్చిన మధ్యవర్తి పెంట‌య్య‌, పెళ్లి జరిపించిన పూజారి ఆంజ‌నేయులు పై బాల్యవివాహ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాలికను సఖి కేంద్రానికి త‌ర‌లించారు. ఈ ఘటనపై జిల్లా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా, అధికారుల తక్షణ స్పందనపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -