బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. “ప్రతిపక్ష నేతల ఇండ్లపై దాడులు చేయడం కాంగ్రెస్ పాలనలో సర్వసాధారణం కావడం దుర్మార్గం. గల్ఫ్ కార్మికుల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే ఇళ్లపై దాడులు చేస్తారా?” అంటూ హరీశ్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెబుతున్న “మోహబ్బత్ కి దుకాన్” ఇదేనా? అంటూ ఎద్దేవా చేశారు. డీసీసీ అధ్యక్షుడి పిలుపుతో ఈ దాడి జరిగిందని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ మౌనంగా ఎందుకు ఉంది? అని ప్రశ్నించిన ఆయన, ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ, తెలంగాణ సీఎంవో వెంటనే స్పందించాలని కోరారు.