ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా? అంటూ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సంపద సృష్టిస్తామని ఊదరగొట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా అప్పులు చేసి, ప్రజలకు ఒక్క పథకం కూడా అందించడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో బుగ్గన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి సర్కార్ ఎక్కువ అప్పు చేసిందని ఆరోపించారు. తమ హయాంలో లక్షల కోట్లు అప్పులు చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పేదల సంక్షేమం కోసమే పని చేసిందని స్పష్టం చేశారు. సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ఇప్పుడు ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలన్నీ ఏమయ్యాయని నిలదీశారు.