కుప్పం మండలం కుర్మానిపల్లిలో ఏనుగుల దాడిలో రైతు కిట్టప్ప మృతి చెందాడు. రాగి పంటకు కాపలా కాస్తున్న సమయంలో ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనతో పరిసర గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల నుంచి రైతులను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బంగారుపాళెం మండలం టేకుమందలో సోమవారం రాత్రి ఏనుగులు పంట పొలాలపై దాడి చేశాయి. కౌండిణ్య అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు మామిడి మానుల ద్వారా పొలాలకు చేరాయి. పరదేశి, కౌసల్య, గోవిందయ్య, రేణుకమ్మలకు చెందిన నాలుగు ఎకరాల వరి మడిని తొక్కేశాయి. అరటి చెట్లను కూడా నాశనం చేశాయి. అప్పులు చేసి పంటలు పండించామని, ప్రభుత్వం సహాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

