Wednesday, November 19, 2025

కుప్వాడాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Must Read

జమ్మూకశ్మీర్ కుప్వాడా జిల్లాలో భద్రతా బలగాలు ఆపరేషన్ పింపుల్ నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. భారత సైన్యం చినార్ కోర్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని నిఘా సమాచారం ఆధారంగా నవంబర్ 7న ఆపరేషన్ ప్రారంభించామని తెలిపింది. ఉగ్రవాదులు విచక్షణారహిత కాల్పులు జరిపారని పేర్కొంది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ వారంలో కిష్తివాడ్ జిల్లాలో ఆపరేషన్ ఛత్రు చేపట్టారు. ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం అందింది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -