పాక్లో భారత విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకో తెలుసా?
న్యూ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. విమానంలోని ఓ ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయాలనుకున్నారు. సమీపంలో ఉన్న పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయానికి సమాచారం పంపారు. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విమానాన్ని కరాచీ ఎయిర్పోర్టులో దింపారు. వెంటనే అక్కడి మెడికల్ టీమ్ వచ్చి ప్రయాణికుడికి చికిత్స చేసింది. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడ్ని నైజీరియాకు చెందిన 60 ఏళ్ల అబ్దుల్లాగా ఆఫీసర్స్ గుర్తించారు.