తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.7 నుంచి రూ.8.50 వరకు పలుకుతోంది. హోల్‌సేల్‌లో 100 గుడ్లు విశాఖలో రూ.673, చిత్తూరు-హైదరాబాద్‌లో రూ.635కు చేరాయి. ఉత్తర భారతానికి పెరిగిన ఎగుమతులు, వ్యాధులతో కోళ్ల మరణాలు, మిచాంగ్ తుఫాన్ నష్టం కారణంగా ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు మూలం. రైతు బజార్లలో కొంచెం తక్కువ ధరకు దొరుకుతున్నా, సామాన్యులు “ఇప్పుడు చికెన్ కంటే గుడ్లే ఖరీదు” అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

