Saturday, August 30, 2025

అనిల్ అంబానీకి ఈడీ సమన్లు

Must Read

రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. రూ. 17 వేల కోట్ల రుణాల మోసం కేసులో దర్యాప్తు వేగవంతం చేస్తూ, ఆయనను ఆగస్టు 5న ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ‌త వారం అనిల్‌ అంబానీకి చెందిన పలు కార్యాలయాలు, అనుబంధ సంస్థలపై మూడు రోజులపాటు 35 ప్రాంగణాల్లో దాడులు జరిపిన ఈడీ, 50 కంపెనీలు, 25 మందికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. య‌స్ బ్యాంక్‌ 2017–19 మధ్య రిలయన్స్‌ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రూ.3,000 కోట్ల రుణం తప్పుడు మార్గాల్లో మళ్లించారన్న ఆరోపణలున్నాయి. య‌స్ బ్యాంక్‌ మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చారన్న అభియోగాలు సైతం వ‌చ్చాయి. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తీసుకున్న రూ.10,000 కోట్ల రుణాన్ని కూడా దారి మళ్లించారన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆర్‌కామ్‌-కెనరా బ్యాంక్ మధ్య జరిగిన రూ.1,050 కోట్ల రుణం విషయంలోనూ మోసపూరిత చర్యల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏటీ-1 బాండ్లలో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ పెట్టిన రూ.2,850 కోట్ల పెట్టుబడులు కూడా ‘క్విడ్ ప్రో కో’ ఆధారంగా జరిగాయన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ అన్ని లావాదేవీలతో కలిపి అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు దాదాపు రూ.17,000 కోట్ల బ్యాంకు రుణ మోసాలకు పాల్పడ్డాయ‌న్నది ఈడీ దర్యాప్తులో తేలిన‌ట్లు స‌మాచారం.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -