Wednesday, April 16, 2025

సోనియా, రాహుల్‌పై ఈడీ చార్జిషీట్‌

Must Read

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ చార్జిషీట్ దాఖలు చేసింది. గాంధీ కుటుంబంపై తొలి ఛార్జిషీట్ దాఖలైంది. సుమన్ దూబే, ఇతరుల పేర్లు కూడా అందులో చేర్చారు. ఈడీ ఫిర్యాదుపై ఈ నెల 25న రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనున్నది. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.64 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసింది. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జిషీట్‌కి వ్యతిరేకంగా నిరసన చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్ల‌డించారు. ఏప్రిల్ 17న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులంతా నిర‌స‌నలో పాల్గొంటార‌ని వెల్ల‌డించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కందుకూరికి జ‌గ‌న్ నివాళి

కందుకూరి వీరేశ‌లింగం పంతులు జయంతి సందర్బంగా నేడు వైసీపీ అధినేత వైయ‌స్‌ జగన్ ఆయ‌న‌కు ఘ‌న‌ నివాళి అర్పించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -