ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికల మోత మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అధికారులకు సూచనలు చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని నీలం సాహ్ని ఆదేశించారు. ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, పోలీస్ బలగాలు, ఎలక్ట్రోరల్ రోల్ అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.