Saturday, August 30, 2025

టీటీడీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య విరాళం

Must Read

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా టీటీడీ దేవ‌స్థానానికి భారీ విరాళాన్ని స‌మ‌ర్పించుకున్నారు. ఇటీవ‌ల వారి కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కుమారుడు ప్రమాదం నుంచి బయటపడటంతో పవన్, ఆయ‌న‌ భార్య అన్నా లెజినోవా సింగ‌పూర్ నుంచి భార‌త్‌కు వ‌చ్చారు. ఆదివారం అన్నా తిరుప‌తిలో శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద అన్నదానం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనానికి రూ.17 లక్షలు విరాళంగా అందజేశారు. అంతే కాకుండా భ‌క్తులు భోజ‌నం కూడా వ‌డ్డించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -