సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీట్ చేసినందుకు ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. రాహుల్ గాంధీని చూసి మోడీ భయపడుతున్నాడని అందుకే ఈడీ కేసు వేశాడనిన నేతలు ఆరోపించారు. వంద మంది మోడీలు వచ్చినా గాంధీ కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించలేరని పేర్కొన్నారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీమతి పి విజయ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.