42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టాండ్ల వద్ద ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రోజూ 3,500 బస్సులు రాకపోకలు సాగించే ఎంజీబీఎస్‌లో ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ, హయత్‌నగర్, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం డిపోల్లో బస్సులు ఆగిపోయాయి. బీసీ సంఘాలు దిల్‌సుఖ్‌నగర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించగా, ప్రైవేట్ బస్సులు, వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం జరిగింది. బంద్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్ వాహనదారులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి బంద్‌లో పాల్గొన్నారు.