Monday, October 20, 2025

వరంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Must Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు నగరంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్‌ ద్వారా వరంగల్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమం వడ్డేపల్లి పీజీఆర్ గార్డెన్‌లో జరగనుంది, ఇందులో సీఎం మధ్యాహ్నం 1:15 నుంచి 1:45 గంటల వరకు పాల్గొని, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సీఎం పర్యటన సజావుగా సాగేలా వరంగల్ నగరంలో అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -