కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. బండి సంజయ్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కానుకగా పలు ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు బండి సంజయ్ ఉచితంగా సైకిళ్ల పంపిణీ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వారీగా కరీంనగర్‌లో 3,096 మంది విద్యార్థులకు, రాజన్న సిరిసిల్లలో 3,841మంది, జగిత్యాలలో 1,137మంది, సిద్దిపేటలో 783 మంది, హనుకొండలో 491మందికి చొప్పున మొత్తంగా 9,348 మంది విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.