సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర స్థాయి స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్ 2025లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన జస్టిస్ విక్రమ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో “నిస్సహాయకులకు అండగా – చిన్నారుల హక్కులు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ ” అన్న అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు ముగింపు కార్యక్రమంలో జస్టిస్ విక్రమ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ పోలీసు, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, యునిసెఫ్, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించారు.